పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మరో విషయంపై సీరియస్‌గా ఫోకస్

Chandrababu Naidu: ప్రభుత్వ శాఖల్లో ఉన్న నిధులేంటి.. ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందనే అంశాలపై...

పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మరో విషయంపై సీరియస్‌గా ఫోకస్

CM Chandrababu Naidu: ప్రజలకు మంచి చేయాలనే తపన. ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలనే పట్టుదల. మార్పు తీసుకురావాలనే కసి.. అన్నీ కలగలిపి చంద్రబాబు, బాబు..నవ్యాంధ్రను పరుగులు పెట్టించే ప్లాన్ చేస్తున్నారు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా.. త్రికరణశుద్ధితో త్రీపాయింట్ ఫార్ములా అప్లై చేసి..ఏపీని అన్నిరంగాల్లో అగ్రగామికి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అలాగని అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని మాత్రం భరోసా ఇస్తున్నారు.

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం అనేది ఏపీ సీఎం చంద్రబాబు మాట. పెన్షన్ల పెంపుతో ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు వేసింది ఏపీ సర్కార్. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పెరిగిన పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన తర్వాత..గ్రామస్థులు, లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వృద్దులు, దివ్యాంగులకు చేయూతనివ్వడం సమాజం బాధ్యత అంటోన్న ఏపీ ప్రభుత్వ పెద్దలు.. నిత్యావసర వస్తువుల ధరలకు కట్టడిపై ఫోకస్ పెట్టారు.

నవ్యాంధ్ర అభివృద్ధిపై తన వ్యూను మరోసారి స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ప్రశ్నించినట్లే.. తాము తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉందంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో పాలనా తీరును మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

పవన్ అభిప్రాయం ఏంటి?
తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది పవన్ అభిప్రాయం. ఏపీకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని ఆయన ఆలోచన. అయితే పాలను గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వ పెద్దలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గత సర్కార్ హయాంలో ఏం జరిగిందో నిధులు ఎటు వెళ్లాయో కూడా అర్థం కానీ పరిస్థితి ఉందంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. జీతం తీసుకుని పనిచేద్దామనుకుంటే.. పంచాయతీరాజ్‌ శాఖలో నిధుల్లేవన్న నిజం తెలిసిందన్నారు.

ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని.. ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో తవ్వే కొద్దీ అసలు విషయాలు బయటికి వస్తుండటంతో షాక్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ సరిచేయాలని..శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించి..జీతం వదిలేస్తున్నానని ప్రకటించారు పవన్ కల్యాణ్. దేశం కోసం, ఈ నేల కోసం పనిచేస్తున్నానని చెప్పారు.

ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌..నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తున్నారు. ఒక్కో శాఖపై రివ్యూ చేస్తున్న చంద్రబాబు..అప్పులు, వడ్డీలు, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని అంశాలపై ఓ క్లారిటీకి వచ్చి..పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే బాధ్యతలు చేపట్టేప్పుడు పెట్టిన ఐదు సంతకాల పైళ్లకు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: పవన్ కల్యాణ్ ఆపరేషన్ ద్వారంపూడి స్టార్ట్ చేసేశారా? మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

శాఖలపై అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. గంటల కొద్ది అధికారులతో మాట్లాడి.. తాను ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాను.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న నిధులేంటి.. ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందనే అంశాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల డైవర్షన్‌పై ఇప్పటికే అధికారులపై సీరియస్‌ అయిన పవన్.. పంచాయతీరాజ్‌ శాఖను.. ఏపీ అభివృద్ధి కోసం మరింత పటిష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.