Chandrababu Naidu: నా జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇదేం కర్మ’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, అందుకే ఈ కార్యక్రమానికి ఇదేం కర్మ అని పేరు ఖరారు చేశామని చెప్పారు. ఒకే రాజధాని కావాలని గతంలో చెప్పారని, ఇప్పుడు మాట మార్చారని అన్నారు.

Chandrababu Naidu: నా జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదు: చంద్రబాబు

Chandrababu shares about how he enter into politics

Updated On : November 19, 2022 / 1:01 PM IST

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇదేం కర్మ’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, అందుకే ఈ కార్యక్రమానికి ఇదేం కర్మ అని పేరు ఖరారు చేశామని చెప్పారు. ఒకే రాజధాని కావాలని గతంలో చెప్పారని, ఇప్పుడు మాట మార్చారని అన్నారు.

కొందరు పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. రేపు అనే ఒక రోజు ఉంటుందని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు.

రాత్రుళ్లు అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మూడున్నరేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నామని, లేనప్పుడు కూడా బాధ్యతగా ఉంటున్నామని అన్నారు. తాము ప్రాంతీయ భావాలతోనే కాకుండా జాతీయ భావాలతోనూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..