Chandrababu Protest: రగిలిపోతున్న టీడీపీ.. కాసేపట్లో చంద్రబాబు దీక్ష..!

ఏపీ CM జగన్ పై TDP నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్‌తో.. ఏపీ రణరంగంగా మారింది.

Chandrababu Protest: రగిలిపోతున్న టీడీపీ.. కాసేపట్లో చంద్రబాబు దీక్ష..!

Cbn

Updated On : October 21, 2021 / 7:32 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్. ఈ పరిణామాలతో.. ఏపీ రణరంగంగా మారింది. మరోసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య.. ప్రత్యక్ష యుద్ధం నడుస్తోంది. తమ పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కాసేపట్లో 36 గంటల దీక్షను ప్రారంభించనున్నారు.

పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యే చంద్రబాబు నిరసన దీక్ష వేదిక ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి చాలా మంది నేతలు చంద్రబాబు దీక్షకు మద్దతుగా.. మంగళగిరికి తరలివచ్చే అవకాశం ఉంది. వారిని పోలీసులు అనుమతిస్తారా.. లేదా.. అన్నది అనుమానంగా ఉంది. మరోవైపు.. రాత్రి నుంచే చంద్రబాబు నివాసంలో టీడీపీ కీలక నేతలు ఉన్నారు. దీక్షపై చర్చించారు. అలాగే.. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ.. ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు.. టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.

ఇక.. పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి డీజీపీని రాజ్ భవన్ కు పిలిపించి గవర్నర్ వివరణ కోరాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం సమీపంలోనే జరిగిన దాడి విషయంలో.. గవర్నర్ ఉదాసీనంగా ఉండడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా దాడులను ప్రేరేపిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును దూషించడం.. మంత్రి కొడాలి నానికి సరికాదని అన్నారు.

Read More:

YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి

YS Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. కావాలని రెచ్చగొడుతున్నారన్న ఏపీ సీఎం!