YS Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. కావాలని రెచ్చగొడుతున్నారన్న ఏపీ సీఎం!

టీడీపీపై.. ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ సంక్షేమ పాలన చూసి.. ప్రతిపక్షం ఓర్వలేక రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

10TV Telugu News

టీడీపీపై.. ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ సంక్షేమ పాలన చూసి.. ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని ఆరోపించారు. బూతులు తిడుతూ రాజకీయాలు చేస్తున్నారని.. ఎవరూ మాట్లాడలేని రీతిలో టీడీపీ కామెంట్లు చేస్తోందని జగన్ అసహనం వ్యక్తం చేశారు. తాము ఎన్నడూ అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని సీఎం జగన్ చెప్పారు. తాను కూడా ప్రతిపక్షంలో ఉన్నానని గుర్తు చేసుకున్న జగన్.. ఏనాడూ తాను బూతులు మాట్లాడలేదని అన్నారు. వారు తిట్టినప్పుడు.. వైసీపీ అభిమానులు ఆగ్రహించి రియాక్షన్ ఇచ్చేలా టీడీపీ నేతలు వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అబద్ధాలు.. ప్రతి మాటలోనూ వంచన.. మోసం.. వక్రబుద్ధి.. మత విద్వేశాలను రెచ్చగొట్టే వైఖరి.. కులాల మధ్య చిచ్చు.. ఇలా రకరకాలుగా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు.

పాదయాత్రలో తాను ప్రజల కష్టాలు దగ్గరినుంచి చూశానని.. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళలు, చేతివృత్తులపై వ్యాపారాలు చేసుకునేవారు లబ్ధి పొందేలా.. జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తామని జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏటా 10 వేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని చెప్పారు. ఏటా.. రెండు సార్లు పథకాన్ని అమలు చేస్తామని.. రుణాలు చెల్లించిన వారికి కొత్తవి మంజూరు చేస్తామని తెలిపారు.

Read More:

AP Bandh: రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపుతో.. ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఎక్కడికక్కడ అరెస్టులు!

Budha Venkanna: దాడికి దాడే మా సమాధానం.. ఇక మేమేంటో చూస్తారు..!

Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అశాంతి సృష్టిస్తున్నారు -మంత్రి బొత్స