Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అశాంతి సృష్టిస్తున్నారు -మంత్రి బొత్స

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్ధేశ్యమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అశాంతి సృష్టిస్తున్నారు -మంత్రి బొత్స

Botsa

Updated On : October 20, 2021 / 11:26 AM IST

Botsa Satyanarayana: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్ధేశ్యమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీని రాజకీయ పార్టీగా నిషేదించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు బొత్స సత్యనారాయణ. ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుడు వ్యాఖ్యలు చేసినవారిని చంద్రబాబు సమర్ధించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, అలాంటి భాషని ఎవరూ మాట్లాడలేదన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకున్నట్లు చెప్పారు బొత్స సత్యనారాయణ.

పట్టాభి వాడిన భాషని చంద్రబాబు ఎందుకు ఖండించలేదని నిలదీశారు బొత్స సత్యనారాయణ. పవన్, చంద్రబాబు కలిసి ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని, చంద్రబాబు బేషరుతుగా జగన్ గారికి క్షమాపణ చెప్పాలన్నారు.