Budha Venkanna: దాడికి దాడే మా సమాధానం.. ఇక మేమేంటో చూస్తారు..!

ఏపీ పోలీసుల తీరును విజయవాడలో.. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటి దగ్గర ఆయన హంగామా సృష్టించారు.

Budha Venkanna: దాడికి దాడే మా సమాధానం.. ఇక మేమేంటో చూస్తారు..!

Budha

Updated On : October 20, 2021 / 11:46 AM IST

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ చేసేందుకు రోడ్లపైకి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరును విజయవాడలో.. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటి దగ్గర ఆయన హంగామా సృష్టించారు.

దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్న బుద్దా.. కర్రలు చేతపట్టి తన ఇంటి ముందు హల్ చల్ చేశారు. దాడికి దాడే తమ సమాధానమని.. ఇక టీడీపీ నాయకులంటే ఏంటో చూస్తారని సవాల్ చేశారు. ఒక చెంపపై కొడితే.. రెండు చెంపలూ వాయిస్తామనంటూ వైసీపీ నాయకులను ఆయన హెచ్చరించారు.

కాసేపటికి ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. పోలీసులు కలగజేసుకున్నారు. వెంకన్నను అరెస్ట్ చేసే క్రమంలో.. ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ దశలో వెంకన్న చొక్కా సైతం కాస్త చిరిగిపోయింది. చివరికి.. బలవంతంగా వెంకన్నను జీపు ఎక్కించిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు.

మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు టీడీపీ సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీసులు నిలువరిస్తున్నారు. హౌస్ అరెస్టులతో నాయకులను కట్టడి చేస్తున్నారు. పోలీసుల తీరును.. టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Read More:

YSRCP-TDP : టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తల దాడి

AP Bandh: రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపుతో.. ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఎక్కడికక్కడ అరెస్టులు!

Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అశాంతి సృష్టిస్తున్నారు -మంత్రి బొత్స