అసెంబ్లీలో సంచలనం : సీఎం జగన్ కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు

మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర, అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు..

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 02:43 AM IST
అసెంబ్లీలో సంచలనం : సీఎం జగన్ కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు

Updated On : January 21, 2020 / 2:43 AM IST

మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర, అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు..

మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర, అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్ కి రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మూడు రాజధానులు మంచిది కాదని చంద్రబాబు చెప్పారు. రాజధానులు పెంచితే అభివృద్ది జరగదన్నారు. ఈ క్రమంలో.. నా కంటే చిన్నవాడివైనా రెండు చేతులెత్తి దండం పెడుతున్నా.. దయచేసి ఆలోచించు, అమరావతిని మార్చొద్దు.. అని సీఎం జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.

మమ

సభలో సైలెన్స్ నెలకొంది. అంతా చంద్రబాబుని చూస్తూ ఉండిపోయారు. సీఎం జగన్ మాత్రం.. చంద్రబాబువైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలా అసెంబ్లీలో ఫస్ట్ టైమ్ సీఎం జగన్ కు చేతులెత్తి దండం పెట్టడం, వేడుకోవడం చర్చనీయాంశమైంది.

సోమవారం(జనవరి 20,2020) వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు, సీఎం జగన్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మూడు రాజధానులు వద్దని.. ఆ ప్రయోగం ఎక్కడా సక్సెస్‌ కాలేదని చంద్రబాబు గట్టిగా వాదించారు. అమరావతి నిర్మాణానికి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదని… కామదేనువులా ఉపయోగపడుతుందని వివరించారు. రాజధానుల వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని… చిత్తశుద్ధితో చేస్తేనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్‌ ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తే…. మూడు లక్షల కోట్లు అవసరం అవుతాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని తెలిపారు. అమరావతికి తామ అన్యాయం చేయడం లేదని.. ఇతర ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా .. ఆయన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అంశం కంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వాపోయారు.

Also Read : రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది : పవన్ కళ్యాణ్