చంద్రబాబు సంకల్పం వల్లే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపన.. ఇక దీనివల్ల..: ఎస్‌ఆర్‌ఎమ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ డైరెక్టర్ పి.నారాయణ రావ్

"ఈ క్వాంటం వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి, యంగ్ రీసెర్చర్స్ కి ఎనలేని అవకాశాలు ఉన్నాయి" అని తెలిపారు.

చంద్రబాబు సంకల్పం వల్లే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపన.. ఇక దీనివల్ల..: ఎస్‌ఆర్‌ఎమ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ డైరెక్టర్ పి.నారాయణ రావ్

SRM Director D Narayana Rao

Updated On : June 16, 2025 / 6:24 AM IST

విద్యా రంగానికి ఏపీలోని కూటమి సర్కారు అందిస్తున్న సహకారంతో ఏపీ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రోత్సాహం ఎలా ఉందో ఎస్‌ఆర్‌ఎమ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ డైరెక్టర్ పి.నారాయణ రావ్ చెప్పారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015-16లో ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ తీసుకువచ్చారు, అంతేకాకుండా మమ్మల్ని ఆహ్వానించి మీరు ఒక సంవత్సరంలో యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి.. మీకు ఏం కావాలో చెప్పండి అని హుటాహుటిన చర్యలు తీసుకున్నారు.

మాకు ఫిబ్రవరిలో 2017 ఫిబ్రవరిలో ల్యాండ్ అలకేట్ అయింది.. 2017 జూలైలో యూనివర్సిటీ స్టార్ట్ చేశాం.. రికార్డ్ ఇన్ ద వరల్డ్.. అది ఎలా జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ప్రోత్సాహ బలం సపోర్ట్ వల్లే.

చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మన భారతీయ సమాజంలో అత్యంత ధనికులు ఉన్నారు.. ధనికులు ఉన్నారు.. ఎడ్యుకేషన్‌ను పిల్లలను అందించలేని కుటుంబాలు ఉన్నాయి.

ఇంటెలిజెన్స్ మాత్రం సమాజంలో ప్రతి వర్గంలో ఉంటుంది.. ఒక వర్గంలో ఉంది ఒక వర్గంలో లేదు అనే అవకాశం లేదు. అట్టడుగు వర్గానికి ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ కల్పించేందుకు.. ధనికులు, సూపర్ రిచ్ పీపుల్ ముందుకువచ్చి వాళ్లని కొంతమందిని కచ్చితంగా ఎడ్యుకేషన్ రంగంలోకి తీసుకొస్తారు. పీ4 ఎఫెక్ట్ విద్యారంగం పైన కచ్చితంగా ఉంటుంది.

కేతిక విద్య వైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు పరిగెడుతున్నారు. కారణం ఏమంటే త్వరగా ఉద్యోగం వస్తుంది జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని. అట్ ది సేమ్ టైం కొంతమంది ఐ వాంట్ టు స్టడీ హిస్టరీ.. ఐ వాంట్ టు స్టడీ లిటరేచర్ అంటుంటారు. మేము వాళ్లందరికీ అవకాశం కల్పిస్తున్నాం. బీటెక్ లో కూడా ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ వైపే పరిగెడతారు.

ఇట్స్ ఆల్ రైట్ ఎందుకంటే అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు దేశంలో మిగతా రంగాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఉదాహరణకు నేషనల్ సెమీకండక్టర్ మిషన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, డీప్ ఓషన్ మిషన్.. సో వీటి వలన మిగతా బ్రాంచెస్ కూడా విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు. ఇంతకుముందు ఓన్లీ సీఎస్సీకే వెళ్లేవారు.

ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇది స్లోగా జరుగుతుంది. అండ్ ఈ క్వాంటం టెక్నాలజీస్ కూడా ఏపీ లో చాలా ప్రముఖంగా ఫోకస్ పెట్టిన జోనర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ క్వాంటం వ్యాలీని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించారు. ఇప్పుడు అమరావతికి క్వాంటం వాలీ శాంక్షన్ అయింది. ఈ క్వాంటం వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి, యంగ్ రీసెర్చర్స్ కి ఎనలేని అవకాశాలు ఉన్నాయి” అని తెలిపారు.