Cheetah Attack : చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత దాడి

చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవికి గాయాలయ్యాయి.

Cheetah Attack : చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత దాడి

Cheetah Attack

Updated On : July 25, 2021 / 6:40 PM IST

Cheetah Attack : చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవికి గాయాలయ్యాయి.

ఆదివారం ద్విచక్రవాహనంపై స్థానిక సింగిరికోన ఆలయానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో చిరుత వీరిని వెంబడించి దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈఘటనలో దంపతులిద్దరికీ గాయాలు కాగా అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వీరిని పుత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఘటన విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేపట్టారు. గతంలో కూడా ఇది పలువురి కంటపడినట్లు స్థానికులు చెబుతున్నారు.