Cheetah Kill Girl : తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపేసిన చిరుత

ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.

Cheetah Kill Girl : తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపేసిన చిరుత

Cheetah killed girl

Updated On : August 12, 2023 / 8:55 AM IST

Cheetah Attacked And Killed Girl : తిరుమల నడకదారిలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. వరుసగా దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. తిరుమలలో విషాదం నెలకొంది. తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందారు. తిరుమల నడకదారిలో బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి.

అలిపిరి మెట్ల మార్గంలో నిన్న (శుక్రవారం) రాత్రి బాలిక తప్పిపోయారు. రాత్రి నడకదారిలో 6 ఏళ్ల చిన్నారి లక్షిత తప్పిపోయారు. తిరుమల నడక దారిలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. గతంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే ఘటన చోటు చేసుకుంది.

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి

ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది. గతంలో బాలుడిపై దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారిపై చిరుత దాడి చేసింది. చిన్నారి శరీరంపై తీవ్ర రక్త గాయాలు అయ్యాయి.

చిరుత దాడిలో మృతి  చెందిన చిన్నారి లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాసేపట్లో చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. లక్షిత తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి.