Chiranjeevi: చిరంజీవి అభిమానుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్టు.. వీడియోలు

వారిని తీసుకెళ్లనివ్వకుండా పోలీసు వాహనాలకు చిరంజీవి అభిమానులు అడ్డంగా పడుకున్నారు. ఫ్యాన్స్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు.

Chiranjeevi: చిరంజీవి అభిమానుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్టు.. వీడియోలు

Chiranjeevi fans

Chiranjeevi -YCP Leaders : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆందోళనలకు దిగారు. చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చిరుపై వైసీపీ నేతల కామెంట్లకు వ్యతిరేకంగా ఇవాళ కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళనకు దిగారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చిరుకి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులకు, చిరంజీవి ఫ్యాన్స్‌కి మధ్య తోపులాట జరిగింది. దీంతో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తీసుకెళ్లనివ్వకుండా పోలీసు వాహనాలకు చిరంజీవి అభిమానులు అడ్డంగా పడుకున్నారు. ఫ్యాన్స్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు.

అనంతపురం నగరంలోనూ చిరంజీవి అభిమానుల నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. టవర్ క్లాక్ వద్ద ఫ్యాన్స్ నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్ గురించి చిరంజీవి మంచి మాటలు చెబితే, ఆయనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చిరు ఫ్యాన్స్ హెచ్చరించారు.

Chiranjeevi: 2024 ఎన్నికల్లో తమ్ముడి కోసం చిరంజీవి రణరంగంలోకి దిగనున్నారా?