CID Notices : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరు చేర్చిన సీఐడీ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

CID Notices : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరు చేర్చిన సీఐడీ

Narayana wife Ramadevi inner ring road case

CID Notices Amaravati inner ring road case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ మరో పిటీషన్ దాఖలుచేసింది. ఈ కేసులో కొత్తగా మరో నలుగురు నిందితుల పేర్లను చేర్చింది. ఇప్పటికే ఈకేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మాజీ మంత్రి నారాయణలను నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్,రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చుతు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేర్చింది.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే నారా లోకేశ్ ను A14గా పేర్కొన్న సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నారాయణను A2గా చేర్చింది. తాజాగా నారాయణ సతీమణి రమాదేవి పేరుతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.