Andhra Pradesh : కుప్పంలో దిష్టిబొమ్మల రాద్దాంతం .. కిందపడిపోయిన సీఐ
కుప్పంలో దిష్టిబొమ్మలు దహనం రాద్దాంతం చోటుచేసుకుంది.చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ ల దిష్టిబొమ్మలు దగ్థం చేయటాని వైసీపీ నేతలు యత్నించారు. దీంతో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేయటానికి టీడీపీ కార్యకర్తలు యత్నించదారు. దాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా ఇరు పార్టీ నేతల మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదికాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

kuppam
Andhra Pradesh : చిత్తూరు జిల్లా కుప్పంలో దిష్టిబొమ్మలు దహనం రాద్దాంతం చోటుచేసుకుంది.చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ ల దిష్టిబొమ్మలు దగ్థం చేయటాని వైసీపీ నేతలు యత్నించారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారు కూడా సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేయటానికి యత్నించదారు. దాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా ఇరు పార్టీ నేతల మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదికాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కాస్తా ఉద్రికత్తలుదారి తీయటంతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వైసీపీ నేతలను ఏమీ అనకుండా మాపై పోలీసులు జులుం ప్రదర్శించారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో కుప్పం సీఐ శ్రీధర్ కిందపడిపోయారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వైకాపా నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.