AP Secretariat Fire Incident : ఎలా జరిగింది..? సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు కీలక ఆదేశాలు
అక్కడి అపరిశుభ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

AP Secretariat Fire Incident : ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాకులో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రదేశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఘటన వివరాలను సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనితను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? ఏ చోటు జరిగింది? ఏ సమయంలో చోటు చేసుకుంది? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు చంద్రబాబు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫొరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని సీఎం చంద్రబాబు అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలు సేకరించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Also Read : అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ? క్యాడర్‌కి కటీఫ్ చెప్పేశారా?
సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండోవ బ్లాక్ లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎం చంద్రబాబుకు వివరించారు సీఎస్ విజయానంద్.
అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని కూడా పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనిపించడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఏపీ సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. సెక్రటేరియట్ భద్రతా వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అలర్ట్ ఇచ్చే సైరన్ పని చేయకపోవడం, అక్కడ అలాంటి ఏర్పాట్లు ఏవీ చేయకపోవడం సంచలనంగా మారింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏయే ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయో ఆయా ప్రదేశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
Also Read : రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
ఈ పరిశీలనలో భద్రతా వైఫల్యాన్ని అధికార యంత్రాంగం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు అలారం పని చేయలేదు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 300 బ్యాటరీలు దగ్దమయ్యాయి. మరో బ్లాక్ లోనూ బ్యాటరీలు ఉండగా, ఆ బ్లాక్ ను కూడా చంద్రబాబు పరిశీలించారు. బ్లాక్స్ లో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడి ఉండటాన్ని గమనించిన సీఎం చంద్రబాబు.. అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. వెంటనే చెత్త చెదారం తొలగించాలని ఆదేశించారు.