రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రామానాయుడు స్టూడియోకు 2003 సెప్టెంబరులో భూములు కేటాయించారు.

రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

Ramanaidu Studios

Updated On : April 4, 2025 / 2:46 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఉన్న రామానాయుడు స్టూడియోకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆ స్టూడియోకు సంబంధించిన భూములపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ భూములను కేటాయించిన అవసరాలకు వాడకుండా లేఅవుట్‌ వేసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారని గుర్తించిన సర్కారు వాటిని రద్దు చేయాలని యోచిస్తోంది.

ఆ స్టూడియోకు ఇచ్చిన 15.17 ఎకరాల భూములను ప్రభుత్వం తిరిగి ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ షోకాజ్‌ నోటీసు ఇవ్వాలంటూ ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రామానాయుడు స్టూడియోకు 2003 సెప్టెంబరులో భూములు కేటాయించారు.

Waqf Land: దేశంలో వక్ఫ్ సంపద మొత్తం ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?

విశాఖ బీచ్‌ రోడ్డులో 34.44 ఎకరాలను అప్పటి టీడీపీ సర్కారు కేటాయించిది. అప్పట్లో ఉన్న మార్కెట్‌ రేటు కింద ఎకరాకు రూ.5.20 లక్షలను సురేశ్ ప్రొడక్షన్స్‌ ఇచ్చింది. దాదాపు 10 ఎకరాల్లో రామానాయుడు స్టూడియో నిర్మాణాలు జరిపారు. మిగితా భూములు దాదాపు 13 ఏళ్లుగా అలాగే ఉన్నాయి.

స్టూడియోకు ఇచ్చిన భూములకు దగ్గరలో బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని తెలుపుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. సీఆర్‌జడ్‌ రూల్స్‌ను కూడా ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఆ భూములను స్టూడియో కోసమే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేఅవుట్లపై గత ఏడాది ఫిబ్రవరి 9న స్టే విధించింది. ఆ స్టూడియో భూములపై కొందరు రాజకీయ నాయకుల కన్ను పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.