Cm Chandrababu: ప్రధాని మోదీకి మనమందరం అండగా నిలవాలి- చంద్రమౌళి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి అవుతున్న దేశం.

Cm Chandrababu: ప్రధాని మోదీకి మనమందరం అండగా నిలవాలి- చంద్రమౌళి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

Updated On : April 24, 2025 / 1:01 AM IST

Cm Chandrababu: పహల్గాం ఉగ్రదాడిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాద చర్యలు భారత్ ను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు. గడిచిన మూడేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లో ఉగ్రదాడితో కలకలం రేపాలని చూశారన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కలసి కట్టుగా ఉండాలని, ప్రధాని మోదీకి అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. విశాఖ వాసి చంద్రమౌళి ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందారని తెలిపారు.

చంద్రమౌళి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. చంద్రమౌళి భౌతికకాయానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, ఎంపీ భరత్, పలువురు టీడీపీ నేతలు నివాళి అర్పించారు. చంద్రమౌళి భౌతికకాయానికి పాండురంగపురంకి తరలించారు. ఈ తరలింపులో కాలినడకన ర్యాలీ చేపట్టారు సీఎం చంద్రబాబు.

Also Read: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే జమ్ముకశ్మీర్‌ లో ముష్కరుల మారణహామానికి కారణమా?

”ప్రధానికి పూర్తి సహకారం ఇవ్వాలి. అందరూ సంఘీభావం తెలియజేయాలి. బాధిత కుటుంబాలు నిలదొక్కుకోవడానికి సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అదే చివరి రోజు కావాలి. 2042కి వికసిత భారత్ సాధించాలి. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి అవుతున్న దేశం. అందుకే ఉగ్రవాదులు ఈ దాడులు చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయం చేసుకుని భద్రత పెంచుతాం” అని చంద్రబాబు అన్నారు.