గోదాట్లో మునిగిన పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ గట్టెక్కింది, 2027 నాటికి పూర్తవుతుంది- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.

గోదాట్లో మునిగిన పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ గట్టెక్కింది, 2027 నాటికి పూర్తవుతుంది- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Cm Chandrababu : పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించడం సంతోషదాయకం అన్నారు సీఎం చంద్రబాబు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది కొంత వెసులుబాటు అని చెప్పారాయన. రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చంద్రబాబు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

”పోలవరం అంటేనే ప్రజలకు సెంటిమెంట్. గోదావరి, కృష్ణా నదుల్లో నీరున్నా కొంత వృధాగా సముద్రంలోకి పోతోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ఇబ్బందులకు గురైంది. విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ముంపు మండలాలు ఏపీకి ఇవ్వలేదు.

28 సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లా. 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశా. 72 శాతం పని పూర్తి చేశాం. 2019 వరకు కాంక్రీటు పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్ వే, కాఫర్ డ్యాం లు కూడా నిర్మించాం. 4,114 కోట్లను అప్పటికి పునరావాసం కోసం ఖర్చు చేశాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పాలిట శనిలా దాపురించింది. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.

ప్రజాస్వామ్యంలో మార్పుల వల్ల 2019లో ప్రమాణం స్వీకారం చేసిన తొలిరోజే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్లను తరిమేశారు. పోలవరం ప్రాజెక్ట్ కొన్నాళ్ళు అనాథగా నిలిచిపోయింది. రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ లు దెబ్బ తిన్నాయి. 2019-24 మధ్య కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మళ్లించేశారు. కాంట్రాక్టర్ ను మార్చొద్దని ప్రాజెక్ట్ అధారిటీ, జలవనరుల శాఖలు లేఖలపై లేఖలు రాసినా వైసిపి పట్టించుకోలేదు.

చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. 55,548 కోట్లు రెండో డీపీఆర్ ను ఆమోదించాలి. ఒక వ్యక్తి చేసిన తప్పిదాల వల్ల జాతి ప్రయోజనాలు ఎంత దెబ్బ తింటాయి అన్న దానికి పోలవరం ప్రాజెక్టు ఒక ఉదాహరణ. మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని నమ్మకం కలిగింది.

దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్లు ఉన్నాయి. మొత్తం 28 వేల కోట్లు వీటిపై వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయి. కృష్ణపట్నం నోడ్ కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణం అవుతాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్ళీ గట్టెక్కింది.

Also Read : వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!

2024-25లో 6వేల కోట్లు.. 2025-26లో 6వేల 157 కోట్లు వస్తాయి. ప్రాజెక్ట్ ను 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్యల వల్ల పోలవరం పనులు ముందుకు సాగలేదు. 2014లో 7 మండలాల విలీనం వల్లే పనులు ముందుకెళ్లాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.