Cm Chandrababu: విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 16.30 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి.

Cm Chandrababu: విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

Updated On : December 8, 2025 / 6:15 PM IST

Cm Chandrababu: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా, పవర్ డిపార్ట్ మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉందన్నారు. అయినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కక్షపూరిత వైఖరితో రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ విధ్వంసం చేసిందన్నారు. గత పాలన దెబ్బతో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. సంక్షేమాన్ని సూపర్ హిట్ చేశామన్నారు.

”గత పాలకులు ప్రజా ధనాన్ని వృథా చేశారు. 2024-19 మధ్య 13.5శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2019-24 మధ్య కాలంలో 10.32 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఒక్క చెరువు కట్టలేదు, రోడ్లు నిర్మించలేదు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులపై పెట్టుబడులను పెంచాం.

రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 16.30 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తెస్తున్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. జనవరి 1 నుంచి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు