Cm Chandrababu : ఆ రూట్లలో స్కూళ్లు, కాలేజీల బస్సులు నడపండి.. రవాణశాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

సంక్రాంతి పండగ నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేందుకు ప్రజలు పయనం అయ్యారు.

Cm Chandrababu : ఆ రూట్లలో స్కూళ్లు, కాలేజీల బస్సులు నడపండి.. రవాణశాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Updated On : January 11, 2025 / 6:33 PM IST

Cm Chandrababu : సంక్రాంతికి ఊరికి వెళ్తున్న ప్రయాణికులకు బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతుండటంతో రవాణశాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను రద్దీ ఎక్కువగా ఉన్న రూట్స్ లో నడపాలని సూచించారు. కాగా, ఫిట్ నెస్ ఉన్న బస్సులనే ఎంపిక చేయాలన్నారు. ప్రజలను సురక్షితంగా వారి వారి గమ్య స్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు..
సంక్రాంతి పండగ నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేందుకు ప్రజలు పయనం అయ్యారు. అయితే, వాహనాలు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు బస్సులు సరిపోవడం లేదనే సమాచారం ముఖ్యమంత్రికి చేరింది. దీంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రవాణ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Also Read : సంక్రాంతి పండుగ వేళ భారీ దందాకు తెరలేపిన ప్రైవేటు ట్రావెల్స్.. ప్రయాణికుల ఆందోళన

ఫిట్ నెస్ ఉన్న బస్సులే వాడాలని సూచన..
ప్రైవేట్, స్కూళ్లు, కాలేజీల బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేయాలని అధికారులు ఆదేశించారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. అయితే, ఫిట్ నెస్ చెక్ చేసుకోవాలన్నారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను మాత్రమే ప్రయాణికులను తరలించేందుకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ద్వారా ఈ బస్సులను నడిపి ప్రయాణికులను వారి ఊళ్లకు చేర్చాలన్నారు.

 

Also Read : సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ: చంద్రబాబు