వైఎస్ జగన్ Vs నారా లోకేశ్.. సోషల్ మీడియా వార్.. వీడియోలు పోస్ట్ చేస్తూ..

మహిళలంటే ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్‌కు జైలు జీవితం ఉందని తెలిపారు. తనకు క్లాస్‌మేట్స్ ఉన్నారని, జగన్‌కు జైల్‌మేట్స్ ఉన్నారని అన్నారు.

వైఎస్ జగన్ Vs నారా లోకేశ్.. సోషల్ మీడియా వార్.. వీడియోలు పోస్ట్ చేస్తూ..

Nara Lokesh, CM Jagan Mohan Reddy

Updated On : June 11, 2025 / 12:24 PM IST

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన కామెంట్లు ఇందులో ఉన్నాయి. అలాగే, నారా లోకేశ్ పలువురు అమ్మాయిలతో దిగిన ఫొటోలను కూడా వీడియో రూపంలో జగన్ పోస్ట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పారదదర్శకంగా పాలన కొనసాగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా కేసులో ఇరికించి, అరెస్టు చేశారని తెలిపారు. కూటమి పాలనలో 188 లైంగిక దాడులు జరిగాయని అన్నారు.

Also Read: డాక్యుమెంట్స్‌ పట్టుకుని కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్

జగన్ ట్వీట్‌పై నారా లోకేశ్ దీటుగా స్పందించారు. జగన్ సహా వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. మహిళలంటే ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్‌కు జైలు జీవితం ఉందని తెలిపారు. తనకు క్లాస్‌మేట్స్ ఉన్నారని, జగన్‌కు జైల్‌మేట్స్ ఉన్నారని అన్నారు.

మహిళలను గౌరవించడాన్ని తాను చిన్నప్పటినుంచు నేర్చుకున్నానని, జగన్ మాత్రం కన్న తల్లితో పాటు సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని, న్యాయస్థానానికి లాగారని అన్నారు. వారిపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ ఐదేళ్ల పాలన ఒక చీకటి అధ్యాయమని విమర్శించారు.