Chandrababu Naidu: చంద్రబాబు ఢిల్లీ సడన్ టూర్ వ్యూహం అదేనా?
వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది.

AP CM Chandrababu
ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీకి వెళ్లడం వెనకున్న వ్యూహమేంటి? అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగా హస్తినకు ఎందుకు వెళ్తున్నారు? ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కూడా కలుస్తుండడం దేనికి సంకేతం? ఏపీ సమస్యలతో పాటు లిక్కర్ స్కాంపై ఏమైనా ఢిల్లీ లెవల్లో డిస్కస్ జరిగే అవకాశం ఉందా? లిక్కర్ స్కాం విచారణ స్పీడప్ అందుకోవడంతో ఆ కేసు గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారా అంటూ రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.? వాచ్ దిస్ స్టోరీ.
ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ఆఫ్ సడెన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. 3రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఈనెల 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కి మాత్రమే హాజరు కావాల్సి ఉందంటున్నారు. అయితే అంతకంటే ముందే అంటే ఈనెల 22నే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు.
గురువారం ఢిల్లీకి చేరుకున్న తర్వాత వరసబెట్టి కేంద్ర మంత్రులను కలవబోతున్నారట. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర ముఖ్య శాఖలను చూసే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారట. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నారని కూటమివర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా..కొన్ని కీలకాంశాలపై చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపబోతున్నారంటూ విన్పిస్తున్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిగ్గా మారాయి.
Also Read: “కాళేశ్వరం” నోటీసులతో ఈటలకు అధ్యక్ష పగ్గాలు దూరమా!?
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారట. అయితే అమిత్ షాతో బాబు భేటీపై రకరకాలైన రాజకీయ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు ఒకవైపు సిట్ దర్యాప్తును స్పీడప్ చేస్తుండగా…మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ లిక్కర్ స్కాంను జెట్ స్పీడ్ వేగంతో స్కాన్ చేస్తోంది. ఏపీ లిక్కర్ లిస్టు ఏ-39దాకా పాకింది. సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది.
ఒకవైపు సిట్.. మరోవైపు ఈడీ
ఇప్పటివరకు దాదాపుగా పెద్ద తలకాయలుగా ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు. ఒక మిగిలింది ఎవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. లిక్కర్ స్కాం కేసు విచారణలో జగన్ ప్రమేయంపైన ఇప్పటి వరకు లభించిన ఆధారాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అమిత్ షాకి వివరించి అక్కడి నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటారన్న గుసగుసలు ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఒకవైపు సిట్ దర్యాప్తును వేగవంతం చేస్తుంటే మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే బాబు ఢిల్లీ టూర్ లో చాలా కీలక విషయాలే ఉండబోతున్నాయని అంతా అంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఇటీవలే భేటీ అయ్యారు. అది జరిగి రోజుల వ్యవధి కాకుండానే చంద్రబాబు 3రోజుల ఢిల్లీ టూర్ కి వెళ్తున్నారంటే చాలా కీలకమైన విషయాలే ఉంటాయన్న చర్చ నడుస్తోంది.
అటు కడపలో మహానాడు పనులు ఒక వైపు జరుగుతండగా..ఇంత సడెన్ గా బాబు ఢిల్లీకి మూడు రోజుల పాటు పర్యటనకు వెళ్ళడంపై రకరకాల రాజకీయ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఢిల్లీ టూర్ అంటే కచ్చితంగా రాజకీయంగా చాలా విశేషమే దాగుందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు అనేక అంశాలపై చర్చిచి మరీ వస్తారని..ఆ మీదట వచ్చే వారం అంతా ఏపీ రాజకీయాల్లో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఏపీలో మేనెల అతి పెద్ద రాజకీయ ప్రకంపనలే సృష్టించబోతుందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రానున్న రోజుల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల టార్గెట్ గానే చర్యలు ఉండబోతున్నాయట.
రానున్న రోజుల్లో మరిన్నీ కీలక అరెస్టులు ఉండొచ్చు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు సడెన్ ఢిల్లీ టూర్..విపక్ష వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోందట. ఏ క్షణంలో ఎవరి అరెస్ట్ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోందట. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అరెస్టై జైళ్లలో ఉన్నారు. వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది. దీంతో అరెస్టైతే ఇక నో బెయిల్…ఓన్లీ జైలే అన్న టాక్ విన్పిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.