Cm Chandrababu : ఏపీలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 విధానపత్రం విడుదల..
ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజమే పీ-4 విధానం అని చెప్పారు.

Cm Chandrababu : ఏపీలో పేదరికం నిర్మూలన కోసం పీ-4 విధాన పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ పీ-4 విధానంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆరోగ్యం, ఆదాయం, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని సీఎం అన్నారు. లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయన్నారు. విద్య, వైద్యం, పౌష్టిక ఆహారం వంటి కనీస అవసరాలు తీరని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు.
ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, సమాజాన్ని శక్తిమంతంగా చేసేందుకు పీ-4 విధానాన్ని ప్రతిపాదించి, విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పాలసీతో సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10శాతం మంది ప్రజలు, అట్టడుగున ఉన్న 20శాతం మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని కోరారు. పేద వర్గాల చదువులు, ఉపాధి అవకాశాలు, నైపుణం పెంచేందుకు పద్ధతి ప్రకారం చేయూతనిస్తే వారి కుటుంబాలు నిలబడతాయన్నారు.
ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజమే పీ-4 విధానం అని చెప్పారు. సమాజంలో వెనకబడిన వర్గాలకు అవసరమైన నాల్డెజ్, సాంతికేకతను అందించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. తెలుగు వాళ్లు దేశ విదేశాల్లో మంచి స్థానాలకు చేరుకున్నారని చంద్రబాబు చెప్పారు. గ్లోబల్ సిటిజన్స్ గా వెళ్లి గ్లోబల్ లీడర్స్ అవుతున్నారని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజలు సత్తా చాటుతున్నారని కితాబిచ్చారు. సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.
Also Read : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట.. ఏకంగా మంత్రుల ముందే..