ఈ నెల 23 నుంచి ఏపీలో గ్రామ సభలు.. ప్రధానంగా ఆ అంశాలపైనే ఫోకస్

గ్రామీణాభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు.

ఈ నెల 23 నుంచి ఏపీలో గ్రామ సభలు.. ప్రధానంగా ఆ అంశాలపైనే ఫోకస్

Grama Sabhalu : ఈ నెల 23 నుంచి గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలు ఏంటి, పరిష్కరించాల్సిన అంశాలు ఏంటి అన్న విషయాలపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణకు రూపొందించిన మొబైల్ యాప్ ఎలా పని చేయనుందో సీఎంకు వివరించారు అధికారులు.

గ్రామీణాభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యంపై రివ్యూ నిర్వహించారు. పారిశుధ్యం నిర్వహణపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అన్న దానికి సంబంధించి ఒక యాప్ ను గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం రూపొందించింది. ఈ యాప్ పని తీరును చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యం నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని సీఎం చంద్రబాబుకు చెప్పారు.

స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశంపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం వారికి ఎంత వేతనం ఇస్తున్నారు, ఏ స్థాయిలో వేతనం పెంచాలి అన్న దానిపై సమీక్షించారు. త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఒక నివేదికను సంబంధిత శాఖ అధికారులు చంద్రబాబుకు అందజేశారు. దాన్ని ఆయన పరిశీలించి అప్రూవల్ చేశాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచనున్నారు.

Also Read : ఆ ఐపీఎస్‌లకు సెలవులు ఇస్తారా? డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి