Annadata Sukhibhava: డబ్బులు పడ్డాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల..

రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 137 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు.

Annadata Sukhibhava: డబ్బులు పడ్డాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల..

Updated On : November 19, 2025 / 4:51 PM IST

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 137 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు. రైతులు తమ ఖాతాలు చెక్ చేసుకోండి. కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుభీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. కేంద్రం ఇచ్చే 2వేలు కలుపుకుని మొత్తంగా 7వేల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డాయి.

ప్రకృతి సేద్యం ఏ దేశంలో ఉంటే ఆ దేశం నెంబర్ వన్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, మా తండ్రికి సేద్యంలో సాయపడ్డా అని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని హామీ ఇచ్చారు.

”మేము ఐదేళ్లు స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అనేక సార్లు కేంద్రాన్ని కోరాం. సొంత గనులు కేటాయించాలని ప్రజల సమక్షంలో ప్రధానిని వైఎస్ జగన్ అడిగారు. మరి మీరేం చేస్తున్నారు.. కార్మికులను అవమానపరుస్తున్నారు.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారా..? శాశ్వత పరిష్కారం చెయ్యాలని కార్మికుల డిమాండ్. వాటికి పరిష్కారం చూపండి.

సీఐ సతీష్ విషయంలో అధికార పార్టీపై ఆరోపణలు చెయ్యడం చేతకాని తనమే. హత్యో.. ఆత్మహత్యో చెప్పాల్సింది ప్రభుత్వం. వాస్తవాలు చెప్పాలి. మీ దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నిరూపణ చెయ్యండి. మా వాళ్ళపై బురద జల్లడం ఏంటి..? ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చా. నేడు అది నెరవేరుతోంది. ఎన్డీయే పొత్తుతో రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతోంది. కూటమి సర్కార్ తో సూపర్ సిక్స్ సూపర్ హిట్.

చెట్టు కింద నుంచి టెక్నాలజీ అభివృద్ధి. ఇదే సుపరిపాలన. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ ఈ మూడు ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో ప్రధాని మోదీ ఆలోచన అమలు చేయాల్సి ఉంది. నీరు సమృద్ధిగా ఉంటే నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఎడారిగా మారిన రాయలసీమను
సస్యశ్యామలం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాల ప్రయాణం నేటికీ కొనసాగుతోంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!