CM Jagan : విభజన హామీలపై అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం

విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని..విజభన జరిగి 10 ఏళ్లు జరిగినా చట్టం పేర్కొన్న అంశాలు అలాగే ఉన్నాయని..ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.

CM Jagan : విభజన హామీలపై అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం

CM JAGAN

Updated On : November 21, 2023 / 8:18 AM IST

CM Jagan..AP Bifurcation Issues  : విభజన హామీల పురోగతిపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఏపీ అధికారులు పాల్గొననున్నారు. దీంతో సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని..విజభన జరిగి 10 ఏళ్లు జరిగినా చట్టం పేర్కొన్న అంశాలు అలాగే ఉన్నాయని..ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.

అప్పుల్లో 58శాతం ఏపీకి,42 తెలంగాణకు కేటాయించారని ..అయితే ఆదాయ పరంగా తెలంగాణాకు 58 శాతం ఏపీకి 42 శాతం కేటాయించారని అన్నారు. ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చలేని..పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే నిధుల విడుదలపై సమస్యలు ఉన్నాయన్నారు. ఇటువంటి సమస్యలను సమావేశంలో ప్రస్తావించాలని అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు.

అలాగే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు కూడా రాలేదన్నారు. ఈ విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించాలని సూచించారు. విభజన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని గట్టిగా కోరాలని అధికారులకు సూచించారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం వంటి విషయాలపై ప్రస్తావించాలన్నారు.