వీళ్లు మనుషులేనా ? : ఇళ్ల పట్టాలిస్తుంటే కేసులు వేస్తారా ? వివరాలు చెప్పిన సీఎ జగన్

వీళ్లు మనుషులేనా ? : ఇళ్ల పట్టాలిస్తుంటే కేసులు వేస్తారా ? వివరాలు చెప్పిన సీఎ జగన్

Updated On : December 28, 2020 / 2:30 PM IST

CM Jagan Distribution Of House Pattas : పేద వాడికి సొంతిళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం చేపడుతుంటే..కొంతమంది దీనిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభమైంది. ఊరందూరులో పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…మొదటి దశలో నిర్మిస్తున్న 15.65 లక్షల ఇళ్లలో 1,78,840 ఇళ్లు చిత్తూరు జిల్లాకే మంజూరు చేశామన్నారు.

కొందరు స్వార్థపరులు కుట్రలు పన్ని న్యాయపరమైన అడ్డంకులు ఏర్పరచడంతో ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వచ్చిందన్నారు. అర్హులైన ప్రతొక్కరికీ డి ఫామ్ పట్టాలను అందచేయడం జరుగుతోందన్నారు. అడ్డంకులు తొలగిన తర్వాత..సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. బాబు, ఆయన సహచరులు అడ్డంకులు సృష్టిస్తూ..స్టేలు తీసుకరావడంతో..25 వ తేదీన 31 లక్షల 75 వేళ్ల ఇళ్ల పట్టాలకు గాను…3 లక్షల 74 వేల మందికి ఇవ్వలేక పోతున్నామన్నారు. డిసెంబర్ 24వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకొనేందుకు హైకోర్టులో పిల్ వేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల విషయంలో స్టే తీసుకొచ్చారన్నారు.

‘అమరావతి రాజధాని అని అంటుంటారు. 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..కులాల పరంగా..తేడా వస్తుందని చెప్పి..ఏకంగా..బాబు మనుషులు కోర్టకు వెళ్లి..కేసులు వేసి స్టే తీసుకొచ్చారన్నారు. ఇలాంటి కారణాలతో కులాల మధ్య వివక్ష చూపుతారా ? అని ప్రశ్నించారు.

విశాఖపట్టణం :
లక్షా 80 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకోవడం జరిగింది. స్థలాలు ఇచ్చిన వారు, పట్టాలు తీసుకొనే వారు సంతోషంగా ఉన్నారు. కానీ…ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి…కోర్టులో కేసులు వేయడం..స్టే రావడం..వచ్చాయి. ఇలాంటి ఘటలను చూస్తుంటే బాధేస్తోంది.

రాజమండ్రి :
ఇక్కడి వారికి కూడా ఇళ్ల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆవా భూములను కాకపోయినా..అవే భూములంటూ..కోర్టుకు వెళ్లి కేసులు వేయడం, స్టేలు తెచ్చుకున్నారు. 27 వేల పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకొంటే అవరోధం ఏర్పడింది.

ప్రభుత్వ భూములను ప్రభుత్వమే తీసుకుని..చేస్తుంటే..మళ్లీ అదే తరహాలో కోర్టుకు వెళ్లడం స్టేలు తెచ్చుకొని వచ్చారు. 34 వేల ఇళ్ల పట్టాలను అడ్డుకున్నారు’. సీఎం జగన్.

ఇలాంటి వారు ప్రజా జీవితంలో ఉండేందుకు అర్హులేనా ? అని ప్రశ్నించారు. త్వరలోనే కోర్టులో కేసులు పరిష్కారమయి…మిగిలిపోయిన 3 లక్షల 74 వేల మందికి ఇళ్ల పట్టాలిస్తామన్నారు సీఎం జగన్.