నాన్నే నా బలం, ఆదర్శం.. ఫాదర్స్ డే రోజున తండ్రిని గుర్తు చేసుకున్న సీఎం జగన్

నాన్నే నా బలం, ఆదర్శం.. ఫాదర్స్ డే రోజున తండ్రిని గుర్తు చేసుకున్న సీఎం జగన్

Updated On : June 21, 2021 / 5:33 PM IST

నేడు(జూన్ 21,2020) ఫాదర్స్ డే(#happyfathersday). ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. తన తండ్రితో తనకున్న అటాచ్ మెంట్ ని ప్రస్తావిస్తూ ట్విటర్‌ లో ఓ పోస్ట్‌ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అంటూ వైఎస్ఆర్ ఫోటోను జత చేసి ట్వీట్ చేశారు సీఎం జగన్.

తండ్రి స్ఫూర్తిగా రాజకీయ ప్రస్తానం:
వైఎస్ జగన్ జీవితంలో ఆయన తండ్రి ప్రేరణ ఎంతగానో ఉంది. వైఎస్ఆర్ మరణానంతర పరిస్థితుల్లో జరిగిన ఓదార్పు యాత్ర జగన్ జీవితాన్ని మలుపు తిప్పింది. కాంగ్రెస్‌ను కాదని పార్టీ పెట్టడానికి దారి తీసింది. అది కూడా తన తండ్రి పేరు వైఎస్సార్ పేరిటే వైఎస్సార్సీపీని (YSRCP) స్థాపించారు.  ప్రతిపక్షనేతగా జగన్ చేసిన పాదయాత్రకు స్ఫూర్తి, ప్రేరణ కూడా నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ చేసిన పాదయాత్రే. ఫాదర్స్ డే సందర్బంగా జగన్ చేసిన ట్వీట్ అభిమానులను, కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని అందరికీ మరోసారి గుర్తు చేసింది.

ప్రపంచంలో అందరికీ నాన్నే తొలి హీరో:
జూన్ 21న అంతర్జాతీయ పితృ దినోత్సవం. ఈ ఫాదర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రపంచంలో అందరికీ నాన్నే తొలి హీరో. అందుకే ఫాదర్స్ డే సందర్భంగా అంతా తమ తండ్రులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.

Read:  తమిళనాడులో సీఎం జగన్ ఫొటోలు : నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ