ఏపీ అసెంబ్లీలో జగన్ ఫైర్ : కళ్లు పెద్దదిగా చూస్తే భయపడుతామా

ఏపీ అసెంబ్లీలో..సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కళ్లు పెద్దదిగా చూస్తే భయపడుతామా ? అంటూ ప్రతిపక్ష నేత బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అబద్దాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. తాము ఇంగ్లీషును అపోజ్ చేశామని అనడం సరికాదని..ఎక్కడైనా చెబితే..ఫ్రూఫ్ చేయాలని బాబుకు సవాల్ విసిరారు. 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియా ప్రవేశపెట్టడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాబు వైసీపీపై పలు విమర్శలు గుప్పించారు.
దీనికి సీఎం జగన్ తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఇంగ్లీషు మీడియాన్ని అపోజ్ చేసినట్లు బాబు చెప్పడం శుద్ధ అబద్దమని ఖండించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..45 వేళ్ల స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టే ఛాన్స్ వచ్చిందని..కేవలం 34 శాతం మాత్రమే ఇంగ్లీషు భాష మాత్రమే ఉందన్నారు. ప్రైవేటు స్కూళ్లకు మేలు చేకూర్చేందుకు అప్పటి టీడీపీ ప్రయత్నం చేసిందన్నారు సీఎం జగన్.
దానికంటే ముందు..బాబు మాట్లాడుతూ..ఇంగ్లీషును ప్రమోట్ చేసింది టీడీపీ..జగన్ ఇంగ్లీషు కనిపెట్టలేదు. ప్రభుత్వ స్కూళల్లో ప్రమోషన్ చేశాం. 2017, ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ ఇంగ్లీష్ అండ్ ఎగ్జామినేషన్ సర్వీస్సా ఇండియా లిమిటెడ్‌తో ఎంవోయూ చేయడం జరిగిందని అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఒక లక్ష మందికి ట్రైనింగ్..ఇచ్చామన్నారు. 2017లో తాము పెడితే..వైసీపీ అపోజ్ చేయడం జరిగిందని, ఆనాడు..వారి పిల్లలు ఎక్కడ చదివారో గుర్తు చేసుకోవాలన్నారు.
దీనికి వైసీపీ సభ్యులు ఖండించారు. తాము ఎక్కడా అపోజ్ చేయలేదన్నారు. బాబు ఆనాడు చేసిన ఈ ప్రోగ్రాం ఫ్రాడ్ అన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. లక్ష మందికి ఇచ్చామని చెబుతున్న బాబు..వాస్తవ విషయాలు ఏంటో సభకు వివరించాలని సూచించారు.
Read More :జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : వైసీపీ సభ్యులు డిమాండ్