CM Jagan : ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం జగన్ సీరియస్.. విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం

ట్రాఫిక్ ఆంక్షలు విధించడం పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విచారణ జరపాలంటే డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగడంపై తాను చింతిస్తున్నట్లు వెల్లడించారు...

CM Jagan : ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం జగన్ సీరియస్.. విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం

Cm Jagan Prc

Updated On : February 10, 2022 / 9:38 AM IST

CM Jagan In Visakhapatnam : తన పర్యటన సందర్భం ట్రాఫిక్ ఆంక్షలు విధించడం పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విచారణ జరపాలంటే డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగడంపై తాను చింతిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ ఇలాంటివి జరగవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం విశాఖ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆయన పర్యటన సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్ ను నిలిపివేశారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలవడంతో సీఎం జగన్ గురువారం రియాక్ట్ అయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై విచారణ జరిపించాలని డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Read More : Tollywood Mega Meeting Live Updates: కాసేపట్లో సీఎంతో మెగా టీమ్ భేటీ.. లైవ్ అప్ డేట్స్

విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. సీఎం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. ఎన్ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు మార్గాల్లో వాహనాలు బారులు తీరి నిలిబడిపోయాయని సమాచారం. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. వారికి ఏమి చెప్పాలో తెలియక పోలీసులు అవస్థలు పడ్డారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు విశాఖకు వచ్చిన సందర్భంలో ఇలాంటతి ఆంక్షలు విధించలేదని వాహనదారులు వెల్లడిస్తున్నారు.

Read More : Mehaboob Dilse : బిగ్‌బాస్ మెహబూబ్ కొత్త ఇల్లు హోమ్ టూర్..

ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకుర్పారణ చేశారు. తర్వాత గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామల యాగం, నిత్యపీటపూజ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు. పీఠం వార్షికోత్సవాలు సందర్భంగా అనేక ఆధ్మాతిక కార్యక్రమాలు, సాంస్కృతిక విభావరి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.