CM Jagan : విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ’మేమంతా సిద్ధం‘ బస్సు యాత్ర.. చెల్లూరు వద్ద బహిరంగ సభ

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం

CM Jagan : విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ’మేమంతా సిద్ధం‘ బస్సు యాత్ర.. చెల్లూరు వద్ద బహిరంగ సభ

CM Jagan

CM Jagan Bus Yatra : ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం అనే పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి జగన్ బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ, ఆనందపురం మీదుగా చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తగరపువలస మీదుగా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలం రాజపులోవ వద్ద విజయనగరం జిల్లాలోకి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుంది.

Also Read : ఏపీ కాంగ్రెస్‌లోనూ టిక్కెట్ల లొల్లి.. షర్మిల మోసం చేశారంటూ కనిగిరి మహిళా నేత ఆరోపణలు

బస్సు యాత్ర డెంకాడ మండలం జొన్నాడ గ్రామం దాటిన తరువాత జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3గంటలకు బస్సు యాత్ర తిరిగి ప్రారంభమై.. బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుంటుంది. చెల్లూరు జంక్షన్ వద్ద 3.30 గంటలకు బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రంసగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, పూసపాటిరేగ మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. తరువాత శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. పైడి భీమవరం లో అడుగుపెట్టనున్న జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రణస్థలం, బుడుమూరు మీదుగా అక్కివలసకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాత్రి బస చేస్తారు.

Also Raed : Proddatur Assembly Race Gurralu : 25ఏళ్ల అనుభవం వర్సెస్ 10ఏళ్ల రాజకీయ చాణక్యం.. గురుశిష్యుల సమరంలో విజేత ఎవరు?