Casino : కాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి – చంద్రబాబు

సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు...

Casino : కాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి – చంద్రబాబు

Chandrababu

Updated On : January 24, 2022 / 4:27 PM IST

CM Jagan Should Respond To The Casino : ఏపీలో కాసినో రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మంత్రి కొడాలి నానిపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనికి ప్రతిగా కొడాలి నాని సవాల్ విసురుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తాను సవాల్ విసిరింది టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికని మంత్రి కొడాలి నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై 2022, జనవరి 24వ తేదీ సోమవారం చంద్రబాబు రియాక్ట్ అయ్యాురు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Read More : Health Workers Fight : రూ.500 కోసం జుట్లు పీక్కున్న హెల్త్ వర్కర్లు.. వీడియో వైరల్

సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పోలీసు కస్టడీలో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేయడాన్ని నేతలు ఖండించారు. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందని వ్యాఖ్యానించారు.

Read More : Telangana BJP : రాజన్న పవర్ ఫుల్ దేవుడు, హామీలు నెరవేర్చకపోతే.. వాళ్ల సంగతి చూసుకుంటాడు

ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలియచేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా…స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత విస్తృతంగా కరోనా వైద్యసేవలు అందించాలని బాబు సూచించారు. వివేకానంద హత్య కేసులో తెర వెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా…కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతోందని ఆరోపించారు. అలాగే… రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్నారని విమర్శించారు.