CM Jagan : నేడు సీఎం జగన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటన..మరో కొత్త స్కీమ్‌ ప్రారంభం

వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేస్తారు. 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్‌ యంత్ర సేవాల కేంద్రాలకు కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.

CM Jagan : నేడు సీఎం జగన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటన..మరో కొత్త స్కీమ్‌ ప్రారంభం

Cm Jagan

Updated On : June 7, 2022 / 8:37 AM IST

CM Jagan tour : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40కి గుంటూరు చుట్టుగుంట సెంటర్‌కు చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను పంపీణీ చేయనున్నారు. రైతన్నలకకు పెట్టుబడి ఖర్చు తగ్గించి..మరింత మెరుగైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకాన్ని రూపొందించింది.

వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేస్తారు. 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్‌ యంత్ర సేవాల కేంద్రాలకు కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. 5వేల 260 రైతు గ్రాపు బ్యాంకు ఖాతాలకు 175 కోట్ల 61 లక్షల రూపాయల సబ్సిడీని జమ చేశారు. రైతన్నలకు ఆర్బీకే వద్దే , వారి గ్రామంలోనే తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

సీఎం జగన్‌ మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లాలోని కొండవీడుకు చేరుకుంటారు. జిందాల్‌ ప్లాంట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హరిత నగరాల నమూనాను ఆయన ఆవిష్కరిస్తారు. జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ను ఆవిష్కరించిన.. ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట 5 నిమిషాలకు తాడేపల్లికి చేరుకుంటారు.