Jagan Tirupati Meeting : కరోనా ఎఫెక్ట్… తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దు
ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు.

Cm Jagans Public Meeting In Tirupati Canceled
CM Jagan’s public meeting in Tirupati : ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు. తిరుపతి లోక్‌సభ ఓటర్లకు బహిరంగ లేఖ రాసిన ఆయన.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. సభకు హాజరైతే వేలాదిమంది తరలివస్తారని, అందరి ఆరోగ్యమే తనకు ముఖ్యమని అందుకే సభను రద్దు చేసుకున్నట్టు లేఖలో సీఎం జగన్ తెలిపారు.
మరోవైపు తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. నడ్డా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ప్రచారానికి వెళ్లనున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల అలిపిరి వరకు ఇరుపార్టీల ముఖ్యనేతలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగుతున్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నడ్డా తిరుపతికి రానుండగా.. మరికొంతమంది ముఖ్యనేతలు కూడా తిరుపతికి వచ్చే అవకాశం ఉంది.