ఎన్నికల వేళ చంద్రబాబుకి సవాలు విసిరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు 'సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు.

ఎన్నికల వేళ చంద్రబాబుకి సవాలు విసిరిన సీఎం జగన్

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. ‘ఈ ఎన్నికల యుద్ధం ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనకు, మాట తప్పేవారికి మధ్య జరుగుతున్న యుద్ధం.

విశ్వసనీయతకు, విశ్వాసం లేనివారికి జరుగుతున్న యుద్ధం. పెత్తందారులతో యుద్ధం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో జన సముద్రం కనిపిస్తోంది. చంద్రబాబుకి ఓ సవాలు విసరుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఇన్నేళ్లు పరిపాలన చేశారు చంద్రబాబు.. ఆయన పేరు చెబితే రైతులకు గర్తు వచ్చే పథకం ఏదైనా ఉందా?

చంద్రబాబు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే ఒక్క విషయమైనా ఉందా? విద్యార్థులకైనా గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క మంచిపని అయినా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా?’ అని జగన్ ప్రశ్నించారు. ఉంటే చెప్పాలని సవాలు విసిరారు.

చంద్రబాబు నాయుడు చేయలేని పనులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం చేసిందని జగన్ చెప్పారు. ప్రజలకు తమ పాలన చాలా అవసరం ఉందని అన్నారు. కనీవినీ ఎరగని విధంగా తాము మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన ఖరారు