Vizag : విశాఖకు సీఎం జగన్.. యుద్ధనౌకల సమాహారం
ఏపీ సీఎం జగన్ విశాఖకు రానున్నారు. మిలాన్ - 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా 2022, ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం ముఖ్యఅతిథిగా ఆయన హాజరు కానున్నారు. ఇంటర్నేషన్ పరేడ్ జరుగనుంది....

Jagan Vishaka
CM YS Jagan Mohan Reddy To Visit Vizag : ఏపీ సీఎం జగన్ విశాఖకు రానున్నారు. మిలాన్ – 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా 2022, ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం ముఖ్యఅతిథిగా ఆయన హాజరు కానున్నారు. ఇంటర్నేషన్ పరేడ్ జరుగనుంది. మధ్యాహ్నం 02.30 గంటలకు విశాఖకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి నావల్ డాక్‌యార్డ్ చేరుకుంటారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొని తర్వాత ఐఎన్‌ఎస్ వేలా సబ్‌మెరేన్ సందర్శిస్తారు, అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్ – 2022లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి గన్నవరం చేరుకుంటారు. ఈ సందర్భంగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 3 గంటలకే ఇన్ వైట్స్ తమకు నిర్ధేశించిన చోట కూర్చొవాల్సి ఉంటుంది.
Read More : Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..
– రాత్రి గం 7-30 నిమిషాల వరకూ ప్రదర్శన.
– పాసులు వున్న వారికే ప్రవేశం.
– 4 వేల మంది పోలీసులు బందోబస్తు.
Read More : GVMC : విశాఖలో ఫ్లీట్ రివ్యూ, బీచ్ రోడ్డులో భవన యజమానుల్లో టెన్షన్.. ఎందుకంటే
– 70 నుంచి 80 వేల మంది వస్తారని అంచనా.
– ఆహ్వానితులు 5 వేల మందికి ప్రత్యేక స్ధానాలు.
– నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి.
– సాధారణ ప్రేక్షకులు వీక్షించేందుకు ప్రత్యేక స్థలాలు.