Santhosh Babu : మోటివేషనల్‌ హాల్‌కు కల్నల్ సంతోష్‌ బాబు పేరు

Santhosh Babu : మోటివేషనల్‌ హాల్‌కు కల్నల్ సంతోష్‌ బాబు పేరు

Santhosh Babu

Updated On : June 21, 2021 / 8:22 AM IST

Santhosh Babu : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలోని మోటివేషనల్‌ హాల్‌ కు వీర జవాన్ బీ. సంతోష్ బాబు పేరు పెట్టారు. సంతోష్ బాబు ఇదే పాఠశాలలో చదువుకున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మోటివేషనల్‌ హాల్‌ కు ఆయన పేరు పెట్టామని తెలిపారు ప్రిన్సిపాల్‌ అరుణ్‌కులకర్ణి.

ఇక ఈ భవనంలో సైన్యంలో పనిచేసిన ప్రముఖుల ఫోటోలను ఉంచారు. సైన్యంలో చేరి వీరమరణం పొందిన సైనికుల చిత్రాలను ఏర్పాటు చేశారు. కాగా జూన్ 15కు కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొంది ఏడాది పూర్తైంది. ఈ సందర్బంగా ఆయన పుట్టిన ఊరు సూర్యాపేటలో విగ్రహం ఏర్పాటు చేసిన విషయం విదితమే.