Amaravati : ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు

అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.

Amaravati : ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు

Amaravati

Updated On : August 1, 2021 / 5:09 PM IST

Amaravati : అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.

ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో వర్షాలు కురుస్తాయన్నారు. అది, సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రాలో కూడా ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఆదివారం, సోమ, మంగళవారాల్లో రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పలు చోట్లు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, పలు చోట్ల పిడుగుల పడే ఛాన్స్ ఉన్నందున సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.