ఇళ్లపట్టాల పంపిణీలో రగడ..వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం

Conflict between YCP and TDP over distribution of houses : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. మోగల్లులో… ఇళ్ల పట్టాల పంపిణీలో రెండు వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. వైసీపీ కన్వీనర్ నరసింహరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టేజ్ పైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓ సమయంలో వివాదం ముదిరి గొడవకు కారణమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సీనియర్ నాయకులు, పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
శుక్రవారం (డిసెంబర్ 25, 2020) తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ ఆర్ జగనన్న ఇళ్లపట్టాల పైలాన్ ను ఆవిష్కరించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఘర్షణ నెలకొనడం గమనార్హం.