56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు : ఏపీ సీజే 

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 09:05 AM IST
56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు : ఏపీ సీజే 

Updated On : January 1, 2019 / 9:05 AM IST

విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ కుమార్ తోపాటు మిగిలిన జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు వచ్చిందన్నారు. హైకోర్టు నిర్వహణలో సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇది మన బాధ్యతను మరింత పెంచుతోందని పేర్కొన్నారు.