Corona effect Thirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ : భక్తుల సంఖ్య 45 వేలకు కుదింపు

తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి శ్రీవారి దర్శనాల విషయంలో టీటీడీ ఆంక్షలు విధించింది.

Corona effect Thirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ : భక్తుల సంఖ్య 45 వేలకు కుదింపు

Corona Effect Thirumala

Updated On : March 31, 2021 / 12:06 PM IST

Corona effect on Thirumala Srivari visits : తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి శ్రీవారి దర్శనాల విషయంలో టీటీడీ ఆంక్షలు విధించింది.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది.. ఇక నుంచి రోజువారీగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను 45 వేలకు పరిమితం చేసింది..

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలలో ఇస్తున్న సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లను ఇక నుంచి 15 వేలకు పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.. మే, జూన్‌కు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కూడా ఉంది టీటీడీ..

ఇప్పటివరకు ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు 22 వేల వరకు ఇస్తుండగా.. వీకెండ్స్‌లో 25 వేల వరకు ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడా సంఖ్యను 15 వేలకు పరిమితం చేశారు.. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో విక్రయించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను.. 25 వేల మంది భక్తులను యథావిధిగా అనుమతిస్తామంది టీటీడీ

ఇక తిరుమలకు వచ్చే భక్తులపైన కూడా టీటీడీ ఆంక్షలు విధించింది. తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీవారి దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను.. 24 గంటలు ముందు మాత్రమే తిరుమల అనుమతిస్తున్నారు. మరుసటి రోజు దర్శనానికి టోకెన్లు ఉన్న భక్తులను.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అలిపిరి టోల్‌ గేట్ నుంచి అనుమతిస్తుండగా.. నడకదారి భక్తులను ఉదయం 9 గంటల తరువాత అనుమతిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. కోవిడ్ నిబంధనలు ఖచ్చింగా పాటించాలని తెలిపింది టీటీడీ. భక్తులందరూ మాస్కులు ధరించడంతో పాటు.. శానిటైజర్‌లు వాడాలని సూచించింది. అంతేకాకుండా తిరుమలలోని వసతి గదుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని.. జలుబు, దగ్గు జ్వరం ఉండే భక్తులు తిరుమలకు రావద్దని టీటీడీ కోరింది.

భక్తుల ఆర్జిత సేవల అనుమతిపై కూడా టీటీడీ పునరాలోచనలో పడింది. ఉగాది నుంచి భక్తులను అనుమతించాలని గతంలో నిర్ణయం తీసుకున్న టీటీడీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్ 14 తరువాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.