ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

ఏపీలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేస్ నమోదైనట్లు. ఒంగోలులో 23 ఏళ్ల యువకుడిలో కరోనా లక్షణాల్ని జిల్లా వైద్యాధికారులు గుర్తించారు.
వైద్య పరీక్షల తర్వాత అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో బాధితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, చెల్లిని రిమ్స్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత యువకుడు ఈనెల 12న లండన్ నుంచి బయలుదేరిన అతడు 15న ఒంగోలు చేరుకున్నాడు.
జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించిన వైద్యులు తిరుపతి ల్యాబ్‌కు పంపారు. బుధవారం రాత్రి అందిన రిపోర్టుల్లో కరోనా ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పుడు ఒంగోలు కేసుతో కలిపి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 2కి చేరింది. ఇక ఏపీలో బుధవారం మరో ముగ్గురు కరోనా అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు.
వెంటనే జిల్లా కలెక్టర్ భాస్కర్ అప్రమత్తమయ్యారు. యువకుడు నివాసం ఉంటున్న ప్రాంతంలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. (కరోనా పంజా, ప్రజలకు సీఎం కేసీఆర్ వార్నింగ్)
కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా..ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఏపీ భవన్ (9871999055 / 9871999059), ఏపీ సచివాలయం (8971170179 / 8297259070) నెంబర్లు కేటాయించారు. IAS అధికారి వెంకట మురళిని కో ఆర్డినేటర్‌గా ప్రభుత్వం నియమించింది.
విదేశాంగ శాఖతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమన్వయం చేసుకోనున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు హైలెవల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆళ్లనాని, మేకపాటి గౌతమ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
* కరోనా ఎఫెక్ట్ తో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
* 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు సహా అన్ని విద్యా సంస్థలకు ఈనెల * * 31 వరకు బంద్ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
* కరోనా ఎఫెక్ట్ ఏపీఎస్ఆర్టీసీపై పడింది.
* విజయవాడ బస్టాండ్‌లో నిత్యం రద్దీగా కనిపించే ప్రయాణికులు..మహమ్మారి భయంతో ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
* బస్సుల్లో అరకొరగా ప్యాసింజర్స్ కనిపిస్తున్నారు.
Read More : డబ్బులిస్తే రాసి పెడతారు..న్యూ మదీనా కాలేజీ బాగోతం
* బెజవాడ రైల్వే స్టేషన్ కూడా ప్యాసింజర్స్ లేక బోసిపోయింది.
* ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్ -19.
* 171 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.
* గడిచిన 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదు.
* 9 వేలకు చేరువైన కరోనా మరణాలు.
* బుధవారం 944 మంది కరోనాతో మృతి.