కరోనా వైరస్ కాదు..క్యాస్ట్ వైరస్ వల్లే..ఎన్నికలు ఆపారు – అంబటి

  • Published By: madhu ,Published On : March 15, 2020 / 12:30 PM IST
కరోనా వైరస్ కాదు..క్యాస్ట్ వైరస్ వల్లే..ఎన్నికలు ఆపారు – అంబటి

Updated On : March 15, 2020 / 12:30 PM IST

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ భగ్గమంటోంది. ఈసీ రమేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగా 2020, మార్చి 15వ తేదీ ఆదివారం వైసీపీ నేతలు డొక్కా, అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. 

కరోనా వైరస్ వల్ల కాదు..క్యాస్ట్ వైరస్ వల్లే స్థానిక ఎన్నికలు ఆపారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కుట్ర పూరితంగా వాయిదా వేశారని వైసీపీ అభిప్రాయమన్నారు. ఏ అధికారులతో మాట్లాడారు ? ఎవరిని సంప్రదించారు ? హెల్త్ సెక్రటరీతో ఎందుకు మాట్లాడలేదు ? అంటూ ఈసీ రమేశ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. బాబు, పవన్‌లకు వాయిదా వేయాలని ఉద్దేశ్యం ఉంటే..ఈ నిర్ణయం తీసుకుంటారా ? ఎలాంటి అధ్యయనం చేశారు ? అని నిలదీశారు. ఏపీలో కేవలం ఒక్క కేసు మాత్రమే రిజిస్టర్ ఉందని, కరోనా వ్యాధి వల్ల ఎన్నికలు వాయిద వేయడం సబబు కాదన్నారు

అంబటి. తప్పు చేస్తే…నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సరి చేసుకుంటారని భావిస్తున్నామని, వాయిదా వేయడం వల్ల పార్టీకి ఏం నష్టం లేదన్నారు. అభివృద్ధి కార్యాక్రమాలకు అడ్డంగా నిలుస్తోంది..ఆరు నెలల పాటు కోడ్ అమల్లో ఉండాల్సిందేనా..అప్పటి వరకు ఏం పనిచేయవద్దా అన్నారు. మార్చి 31లోగా ఎన్నికలు జరపాలని తాము కూడా భావిస్తున్నామని, అయితే..కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయన్నారు.

14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ. 5 వేల 800 కోట్లు రాకపోతే..రాష్ట్రం ఎంత నష్టపోతుందన్నారు. అందుకే తాము ముందుగానే ఎన్నికలు పెట్టామన్నారు. కుట్రలో బాబు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చౌదరి భాగస్వాములవుతున్నారని, మిగతా కుట్రదారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు అంబటి. 

ఇదే విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమని, ఇలాంటి ప్రక్రియను ఓ సాకుతో వాయిదా వేయడం వల్ల ఈసీ అన్ని పద్ధతులను విస్మరించడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే దీనిని సమీక్షించుకోవాలని ఈసీకి విన్నవించుకున్నట్లు తెలిపారు. పేద వాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వాయిదా వేశారని, ప్రస్తుతం ఆరు వారాల పాటు..కోడ్ ఉంటుందని ప్రకటించడంతో అప్పటిదాక వెయిట్ చేయాలనడం కరెక్టేనా అని ప్రశ్నించారు డొక్కా. 

Read More : కన్నీళ్లు తెప్పించే ఘటన : కరోనా సోకిందని తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేదు