Vishaka Central Jail లో 27 మంది ఖైదీలకు కరోనా

ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధారణైంది.
అనారోగ్యంతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరిన మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాష్…ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించిన అనంతరం అతనికి పరీక్షలు చేయగా..కరోనా వైరస్ వచ్చనట్లు తేలింది.
ఒక్కసారిగా జైలు అధికారులు కంగారు పడిపోయారు. జైలులో ఉన్న ఖైదీలకు, సిబ్బందికి పరీక్షలు చేశారు. దీంతో 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జైల్లో ఖైదీలకు కరోనా సోకిందని తెలుసుకున్న వారి వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఓం ప్రకాష్ తో సన్నిహితంగా ఉన్నవారికి కూడా కరోనా వైరస్ సోకిందని తేలింది.
ఎక్కువ మంది జైల్లో ఉండకుండా చర్యలు తీసుకున్నారు. రిమాండ్ ఖైదీలతో పాటు, వారి కుటుంబసభ్యులకు, జైలు సిబ్బందికి పరీక్షలు చేయాలని జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది.
నేరాలు జరిగిన సమయంలో..ఖైదీలకు పరీక్షలు చేయాలని నెగటివ్ ఉంటే..మాత్రం లోనికి అనుమతినివ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక పాజిటివ్ వచ్చిన ఖైదీలను క్వారంటైన్ తరలిస్తారని తెలుస్తోంది.