రాయలసీమలో కరోనా కలకలం, 49మందికి ఫ్లూ లక్షణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 01:43 PM IST
రాయలసీమలో కరోనా కలకలం, 49మందికి ఫ్లూ లక్షణాలు

Updated On : March 23, 2020 / 1:43 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది తిరిగి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అందులో 483 మందికి 28 రోజుల హోం క్వారంటైన్ పూర్తి కాగా మరో 3వేల 522 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం రాయలసీమలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదు కానప్పట్టికి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారిలో 2వేల 150 మంది కడప జిల్లా వాసులు ఉన్నారు. వారంతా స్వస్థలాలకు చేరుకున్నారు. వారిలో 49మందిలో ఫ్లూ లక్షణాలు గుర్తించారు అధికారులు. వారి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టుల్లో 46మందికి నెగెటివ్ వచ్చింది. మరో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వారి రిపోర్టులు రావాల్సి ఉంది. 

విదేశాల నుంచి ఎక్కువమంది తిరిగొచ్చిన రెండవ అతి పెద్ద జిల్లాగా కడప జిల్లా ఉంది. గడిచిన నెల రోజుల్లో 2వేల 500మంది విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఈ విషయంలో ఏపీలో తూర్పుగోదావరి జిల్లా మొదటి ప్లేస్ లో ఉంది. 

గల్ఫ్ దేశాలు దుబాయ్, కువైట్, కతార్, అబుదాబి నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కడపకు తిరిగొచ్చారు. పైగా కడప జిల్లా ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా. దీంతో అధికారులు ప్రత్యేకంగా కడప జిల్లాపై ఫోకస్ పెట్టారు. హోం ఐసోలేషన్ లో ఉన్న 2వేల మందిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి కరోనా పాజటివ్ కేసు నెల్లూరులో నమోదైంది. చికిత్స తర్వాత అతడు కోలుకున్నాడు.