ఏపీలో 143కి చేరుకున్న కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : April 2, 2020 / 01:39 PM IST
ఏపీలో 143కి చేరుకున్న కరోనా కేసులు

Updated On : April 2, 2020 / 1:39 PM IST

కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా గట్టిగానే పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 132కేసులు ఉండగా.. లేటెస్ట్‌గా మరో పదకొండు కరోనా కేసులు ఉన్నట్లు తేలింది. ఇవాళ మొత్తం 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 143కి చేరుకుంది. ఉదయం నుంచి కరోనా విషయ౦లో కాస్త అలజడి చెలరేగగా.. ప్రభుత్వంలో కూడా తాజా లెక్కలతో ఆందోళన మొదలయింది.

కరోనా వైరస్ మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలారు. రాబోయే రెండు రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోలేదు. 

ఉదయం 9 గంటల తర్వాత ఈ మూడు కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగక్య శాఖ వెల్లడించింది. కృష్ణా జిల్లాలో మాత్రం అత్యధికంగా 23పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు 111 పాజిటివ్‌ కేసులు ఉండగా.. వైద్యఆరోగ్యశాఖ ఈ ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. (కరోనా వ్యాక్సిన్.. ప్రీ క్లినికల్ టెస్టింగ్ ప్రారంభం)

దాంతో పాజిటివ్‌ కేసులు 132కి చేరుకోగా.. మధ్యాహ్నం 3 కేసులతో ఆ సంఖ్య 135కి చేరుకుంది. లేటెస్ట్‌గా నమోదైన 8 కేసులతో సహా.. మొత్తం సంఖ్య 143కి చేరుకుంది. 

cORONA