Cow Maha Sammelanam : తిరుపతి మహతి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు గో మహా సమ్మేళనం

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఇవాళ, రేపు గో మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు మఠాధిపతులు పీఠాధిపతులు హాజరవుతారు.

Cow Maha Sammelanam : తిరుపతి మహతి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు గో మహా సమ్మేళనం

Tirumala Go Maha Sammelanam

Updated On : October 30, 2021 / 8:38 AM IST

Cow Maha Sammelanam in Tirupati : తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఇవాళ, రేపు గో మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వహ‌ణ-గో ర‌క్షణ‌-గో ఆధారిత వ్యవ‌సాయంపై ఆంధ్ర, తెలంగాణల‌కు చెందిన వెయ్యి మంది రైతుల‌కు అవ‌గాహ‌న‌ కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మఠాధిపతులు పీఠాధిపతులు హాజరవుతారు. వీరందరి కోసం శ్రీనివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామి సత్రాలు, ఎస్వీ అతిథిగృహంలో బస ఏర్పాటు చేశారు. టీటీడీ అన్నదాన విభాగం రైతులకు సంప్రదాయ భోజనం అందించనుంది.

గో మహాసమ్మేళనం కోసం మహతి కళాక్షేత్రంలో 24 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో టీటీడీ తయారు చేయించిన అగరబత్తులు, ఆయుర్వేద, పంచగవ్య ఉత్పత్తులు, టీటీడీ ప్రచురణలు, డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో చేసిన చిత్రపటాలను ఉంచనున్నారు. యుగతులసి ఆధ్వర్యంలో 20 స్టాల్స్‌లో ప్రాచీనకాలం నాటి గానుగలు, పూర్వకాలం ఉపయోగించిన వంటపాత్రలు, గో ఆధారిత ఉత్పత్తులు, దేశీయ విత్తనాలు, కలంకారి వస్తువులు తదితరాలను ఏర్పాటు చేస్తున్నారు.

Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ కార్యక్రమంలో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై పలు సూచనలు చేస్తారు. దేశంలో గో సంరక్షణకు కృషి చేస్తున్న వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఎండిన భూమిలో నీటిని దాచుకునే విధానాన్ని, దేశీ ఆవులు, దేశీ విత్తనాల ప్రాముఖ్యత రైతులకు తెలియజేస్తారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎకరాకు రూ.25 వేలు సంపాదించుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులను ఈ కార్యక్రమం ద్వారా టీటీడీకి నేరుగా అనుసంధానం చేస్తారు.