Cyclone: తుపాన్‌ అలర్ట్‌.. ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ప్రజలకు సూచనలు

రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyclone: తుపాన్‌ అలర్ట్‌.. ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ప్రజలకు సూచనలు

Updated On : October 22, 2025 / 9:34 AM IST

Cyclone: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది.

రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపాన్‌గా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు. (Cyclone)

Also Read: పండుగ పూట మోదీకి ఫోన్ చేసి దీనిపై మాట్లాడానన్న ట్రంప్.. మోదీ ఏమని ట్వీట్ చేశారంటే?

రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తామని అన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.