పింగళికి భారత రత్న ఇవ్వాలి, మోడీకి జగన్ లేఖ
భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య. జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Jagan
Pingali Venkayya : భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య. జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ క్రమంలో…2021, మార్చి 12వ తేదీ శుక్రవారం ఉదయం జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. అనంతరం భారత ప్రధాన మంత్రికి సీఎం జగన్ స్వయంగా లేఖ రాశారు. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖలో కోరారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
1921లో జాతిపతి మహాత్మా గాంధీ సూచన మేరకు బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీకి ఇచ్చారు పింగళి. ఈ జెండాతోనే…బ్రిటీష్ వారికి నిద్రపట్టకుండా చేశారు. కానీ…జెండా రూపశిల్పికి ఇచ్చిన గౌరవం ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అనంతరం పద్మ అవార్డును ప్రకటించింది. 2009 లో అప్పటి ప్రభుత్వం…పేరిట స్టాంప్ విడుదల చేసింది.