Houses Demolition : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు కూల్చివేత
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు పట్టుడుతుంటే తమకు ఇంకా సమయం కావాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

BHOGAPURAM
Houses Demolition : విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు పట్టుడుతుంటే తమకు ఇంకా సమయం కావాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఒప్పుకోని రెవెన్యూ అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకు దిగిన నిర్వాసితులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నిర్వాహిత గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.
విమానాశ్రయం నిర్మాణానికి సుమారు 2 వేల 7 వందల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించగా ఆ ప్రాంతంలో ఉన్న మరనప్పాలెం, రెల్లిపేట, బొళ్లింకల పాలెం, ముడిసర్లపేటను అధికారులు నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల ప్రజలకు గూడెపు వలస, లింగాల వలస వద్ద స్థలాలను కేటాయించి అక్కడ పునరావాస ఇళ్లను నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి ఐదు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.9 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
CM Jagan Airport : జిల్లాకో ఎయిర్‌పోర్టు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
తమకు కేటాయించిన స్థలాల్లో చాలా మంది నిర్వాసితులు ఇప్పటికే ఇళ్లను పూర్తి చేసుకుని
తరలిపోగా, మరికొంత మంది మాత్రం ఇంకా ఇళ్లను నిర్మించుకోలేకపోయారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు గ్రామాల్లోనే ఉండేందుకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇందుకు ససేమిరా అంటూ నిర్వాహిత గ్రామాల్లో ఇళ్లను కూల్చే పనిలో పడ్డారు. ఇప్పటికే బొళ్లింకపాలెం, మడసర్ల పేట, రెళ్లిపేట గ్రామాల్లో భవనాలను పూర్తిగా నేల మట్టం చేశారు.
మిగిలిన మారానపాలెం గ్రామంలో ఉన్న భవనాలన కూడా కూల్చేందుకు భారీ ఎత్తున జేసీబీలు, ట్రాక్టర్లతో రెవెన్యూ అధికారులు వచ్చారు. రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితుల ఆందోళనకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు అండగా నిలిచారు. పునరావాస ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మరనాపాలెం గ్రామస్తులకు లింగాలవలసలో పునరావాస ఇళ్లు నిర్మిస్తున్నారు.
Executive Capital Visakha : ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపై ఏపీ సర్కార్ ఫోకస్
చాలా వరకు ఇళ్ల నిర్మాణ పూర్తి కాలేదు. మౌళిక వసతులు కల్పించలేదని నిర్వాసితులు అంటున్నారు.
మరో రెండు నెలలపాటు తమకు గడువు ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, సంక్రాంతి పండుగకే గడువు ముగిసిందని చెబుతున్నారు. గ్రామాలను ఖాళీ చేయకుండా తమ విధులను అడ్డుకోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.