CM Jagan Airport : జిల్లాకో ఎయిర్‌పోర్టు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్.

CM Jagan Airport : జిల్లాకో ఎయిర్‌పోర్టు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

Cm Jagan Airport

CM Jagan Airport : ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలని అన్నారు సీఎం జగన్. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్‌ పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ఎయిర్‌పోర్టు అన్నది మంచి కాన్సెప్ట్ అన్న సీఎం జగన్.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలనే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని అధికారులతో చెప్పారు జగన్.

Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని.. నిర్వహణలో ఉన్న ఎయిర్ పోర్టుల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల‌న్నారు సీఎం జగన్.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

సీ పోర్టులపైనా అధికారులతో సమీక్షించారు జగన్. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల పనుల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. భావనపాడు, రాయాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 9 ఫిషింగ్‌ హార్బర్లలో తొలి దశలో నిర్మాణం చేపడుతున్న 4 హార్బర్లను అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో తూర్పగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. రెండో విడతలో చేపడుతున్న 5 హార్బర్ల నిర్మాణం నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.